- సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌పై అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌ఐ రవీందర్
- బొడ్డు చింతలపల్లిలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
నవతెలంగాణ – గీసుకొండ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని గీసుగొండ ఎస్‌ఐ రవీందర్ సూచించారు. మండలంలోని బొడ్డు చింతలపల్లి గ్రామంలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఐ మాట్లాడుతూ గుట్కా, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. మూఢనమ్మకాలను నమ్మకుండా తల్లిదండ్రులను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు.
ప్రజలకు, పోలీసులకు మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండాలని, ప్రజల రక్షణ, భద్రత కోసమే పోలీసులు పనిచేస్తారని తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై వేధింపులు జరిగితే అత్యవసర సహాయం కోసం 112కు సమాచారం అందించాలన్నారు. సమస్యాత్మక గ్రామంగా పోలీసు రికార్డుల్లో నమోదైతే భవిష్యత్తులో గ్రామానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. కేసుల్లో నిందితులుగా ఉంటే విదేశీ ప్రయాణాల సమయంలో పాస్‌పోర్టు, వీసా పరిశీలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోగుల వనిత యుగంధర్, పోలీస్ కళాజాత బృందం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు (0)