Magazines

న్యూ విరాట్ నగర్‌లో రూ.9 లక్షలతో వాటర్ లైన్ పనులకు శంకుస్థాపన

21 నిమిషాల క్రితం

Virat Nagar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

- ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

నవతెలంగాణ - నాచారం: ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని న్యూ విరాట్ నగర్‌లో రూ.9 లక్షల నిధులతో చేపట్టనున్న నూతన వాటర్ లైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి నియోజకవర్గంలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ప్రారంభించిన వాటర్ లైన్ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్