నవతెలంగాణ - హైదరాబాద్ : భారత్, జింబాబ్వే మహిళా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు (అక్టోబర్ 18) జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. కెప్టెన్ స్మృతి మంధాన నేతృత్వంలోని భారత జట్టు తొలి మ్యాచ్‌లో దీప్తి శర్మ, నికి ప్రసాద్ రాణించడంతో విజయం సాధించింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.






కామెంట్‌లు (0)