Magazines

నేడు ఇండియా కూటమి ర్యాలీ..

1 గంట క్రితం

Indy Coalition Rally Today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండీయా కూటమి ఆదివారం ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనుంది. అయితే నిరసన సభకు మాత్రమే అనుమతి కోరారని, ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 4 వేల మంది పోలీసులతో పాటు 200 కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఈ నిరసనకు అభిజీత్‌ దీప్కే మద్దతు ప్రకటించారు. అయితే ర్యాలీలో మాత్రం తాను పాల్గొనడం లేదని వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్