నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతారం గ్రామంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుర్కపల్లి నుంచి పోతారం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పొన్న కృష్ణ (54)ను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
టిప్పర్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
1 గంట క్రితం

tipper
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)