Magazines

రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి..

36 నిమిషాల క్రితం

kcrs-attendant-dies-in-road-accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్‌రెడ్డి అలియాస్ మణికుమార్‌రెడ్డి మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భరత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 2 గంటల సమయంలో మృతి చెందాడు. దీంతో ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

మణికుమార్‌రెడ్డి మృతి వార్త తెలుసుకున్న కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావుతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్