నవతెలంగాణ - హైదరాబాద్ : దేశవాళీ టీ20 క్రికెట్‌లో ఢిల్లీ కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య సరికొత్త రికార్డు సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 68 బంతుల్లో 181 పరుగులు చేసి భారత బ్యాటర్‌గా టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి.
ప్రియాన్ష్ 18 బంతుల్లో అర్ధశతకం, 36 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ సాధించిన 152 పరుగుల రికార్డును అధిగమించాడు. టీ20ల్లో ప్రపంచంలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్రియాన్ష్, ఒక ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు బాది ఫిన్ అలెన్ రికార్డును సమం చేశాడు. ప్రియాన్ష్ ధాటికి ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఇది మూడో అత్యధిక జట్టు స్కోరు. 19వ ఓవర్‌లో మణిమారన్ సిద్ధార్థ్ బౌలింగ్‌లో ప్రియాన్ష్ ఔటయ్యాడు.





కామెంట్‌లు (0)