నవతెలంగాణ కల్లూరు
కల్లూరులోని చండ్రుపట్ల క్రాస్ రోడ్డు వద్ద రెండు బైకులు ఢీకొని మహిళలకు తీవ్ర గాయాలు కావటం మృతి చెందింది. మంగళవారం మండల పరిధిలోని వాత్యా నాయక్ తండాకు చెందిన గుగులోత్ కౌసల్య(65) హీరో హోండా బండి మీద సబ్ స్టేషన్ నుండి వాచా నాయక్ తండాకు కొడుకుతోపాటు వెళుతుండగా చుండ్రుపట్ల క్రాస్ రోడ్ వద్ద వెనక నుండి వచ్చిన ఒక వ్యక్తి రెండు మోటార్ సైకిల్ల ను ఢీకొట్టడంతో రోడ్డుపై పడి తలకు తీవ్రమైన గాయమై మృతి చెందింది. ఈ ఘటనలో మృతురాలి కుమారుడు కిషోర్ కు, గాయాలయ్యాయి, అదేవిధంగా ముందెలుతున్న మాజీ ఎంపీటీసీ భానోత్ బాలు బండిని కూడా ఢీకొట్టడంతో స్వల్ప గాయాలయ్యాయి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతురాలు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.





కామెంట్‌లు (0)