Magazines

అవార్డు ఫోన్‌ను స్టేడియం మహిళా సిబ్బందికి బహుమతిగా ఇచ్చిన కేఎల్ రాహుల్

5 గంటల క్రితం

KL Rahul gifts the award-winning phone to a female stadium staff member
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన మంచి మనసుతో అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో లభించిన అవార్డు కింద వచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను స్టేడియం మహిళా సిబ్బందికి బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో 'గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుకు ఎంపికైన రాహుల్‌కు స్మార్ట్‌ఫోన్ బహుమతిగా లభించింది. అయితే దాన్ని తన వద్ద ఉంచుకోకుండా వెల్లింగ్‌టన్‌లోని హెన్రీ స్టేడియంలో పనిచేస్తున్న మహిళా అధికారికి అందించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. రాహుల్ దయాగుణాన్ని ప్రశంసిస్తూ 'పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు' అంటూ అభినందించింది. ఇక వర్షం కారణంగా కుదించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే హామిల్టన్‌లో జరగనుంది.



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్