నవతెలంగాణ-హైదరాబాద్: థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫుకెట్ ద్వీపంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం వాహనాల అద్దె వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే అవి పక్కనే ఉన్న పలు భవనాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 36 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో సుమారు 100 మోటార్ సైకిళ్లు పార్క్ చేసి ఉన్నాయని పటాంగ్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ సనకోర్న్ కీసిన్ తెలిపారు. వాహనాల్లోని ఇంధనం, రబ్బరు టైర్లు, ప్లాస్టిక్ భాగాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించినట్లు వివరించారు.








కామెంట్‌లు (0)