నవతెలంగాణ-హైదరాబాద్: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ వర్గానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత (ఎల్వోపీ)గా రిటాబ్రత బెనర్జీ నియామకాన్ని రద్దు చేసింది. చీఫ్ విప్ అఖ్రుజ్జమాన్ నియామకాన్ని కూడా కోర్టు కొట్టివేసింది. (Ritabrata Banerjee) బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ తీసుకున్న ఈ నిర్ణయం సమంజసం కాదని కలకత్తా హైకోర్టు శుక్రవారం పేర్కొంది. మమతా బెనర్జీ వర్గం చేసిన వాదనలను తిరిగి పరిశీలించాలని స్పీకర్‌ను ఆదేశించింది. అలాగే ప్రతిపక్ష నాయకుడి అంశంపై 10 రోజుల్లోగా కొత్త ఉత్తర్వులను జారీ చేయాలని సూచించింది. మమతా వర్గానికి చెందిన సీనియర్ నేత శోభన్‌దేబ్ చటోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. పార్టీ తరపున తన పేరును ప్రతిపాదించినప్పటికీ, రిటాబ్రతను ప్రతిపక్ష నాయకుడిగా స్పీకర్ గుర్తించడాన్ని ఆయన సవాల్ చేశారు.
టీఎంసీ రెబల్ వర్గానికి భారీ షాక్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)