నవతెలంగాణ - హైదరాబాద్ : ఇండోనేసియా రాజధాని జకార్తా సమీపంలోని చికాండేలో చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 24 మంది కార్మికులు మృతి చెందగా, మరో 30 మంది ఆచూకీ గల్లంతైంది. శనివారం సాయంత్రం ప్రారంభమైన మంటలు సోమవారం నాటికి తీవ్రరూపం దాల్చాయి. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధ్యక్షుడి సలహాదారు సయీద్ ఇక్బాల్ తెలిపారు. భవనం కూలిపోయే ప్రమాదం ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి.
చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 24 మంది మృతి
15 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)