నవతెలంగాణ - హైదరాబాద్ : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భోగాపురం హైవేపై సుందరపేట సమీపంలో లారీని జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.






కామెంట్‌లు (0)