నవతెలంగాణ - హైదరాబాద్ : సామాజిక సంస్కర్తలు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత పోరాటం ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ చిత్రం నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కులవివక్ష, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడి విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన ఫూలే దంపతుల జీవితాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు. అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించగా, డా. పొన్నం రవిచంద్ర నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వీక్షించింది. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కులవివక్ష నిర్మూలన, మహిళా విద్య కోసం ఫూలే దంపతులు చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమానత్వం, విద్య, మానవత్వం వంటి విలువలను చాటిచెప్పే ఈ చిత్రాన్ని యువత, విద్యార్థులు తప్పక చూడాలని చిత్ర బృందం కోరింది.
తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’..
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)