Magazines

'బిలాంగింగ్' పై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె కీలక వ్యాఖ్యలు

2 గంటల క్రితం

Pranab Mukherjee'
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని మంత్రి కావాలని ఆశపడ్డారని ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'లో కాంగ్రెస్ అధ్యక్ష‍రాలు సోనియా గాంధీ రాసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటలీలో తన చిన్ననాటి జీవితం నుంచి రాజీవ్ తో ప్రేమ ప్రయాణం తోపాటు అనేక విషయాలను తన ఆత్మకథలో వివరంగా పేర్కొన్నారు.


ఈక్రమంలోనే 2010లో ప్రణబ్ ముఖర్జీతో జరిగిన సంభాషణను ప్రస్తావిస్తూ ఇలా రాశారు: "బహుశా ఉన్నత స్థాయిలో మార్పునకు సమయం ఆసన్నమైందేమోనన్న సూచనతో ఆయన నన్ను దిగ్భ్రాంతికి గురిచేశారు. ప్రధానమంత్రి కావాలన్న ఆయన చిరకాల వాంఛకు అది ఒక సూచనగా నేను అర్థం చేసుకున్నాను". అని అన్నారు.


తాజాగా ఆ వ్యాఖ్యలపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠా ముఖర్జీ స్పందించారు. తన తండ్రికి ప్రధానమంత్రి కావాలనే ఆశయం ఉండటంలో తప్పేముందని ప్రశ్నించారు. "అగ్రస్థానంలో మార్పు" రావాల్సిన సమయం వచ్చిందని ఆ అనుభవజ్ఞుడైన నాయకుడు సూచించినప్పుడు, అది సోనియా గాంధీని ఎలా "దిగ్భ్రాంతికి" గురిచేసిందో ఆమెను ప్రశ్నించారు. తన తండ్రికి ప్రధానమంత్రి కావాలనే ఆశయం ఉండటానికి "దశాబ్దాల అనుభవం" "అసాధారణ మేధస్సు" తోడ్పడ్డాయని గుర్తుచేశారు.

Image







ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్