నవతెలంగాణ-హైదరాబాద్ : హాలీవుడ్ ప్రముఖ నటుడు, ఎమ్మీ అవార్డు గ్రహీత టామ్ స్కెరిట్ (93) కన్నుమూశారు. ‘ఏలియన్’, ‘టాప్ గన్’ వంటి ప్రఖ్యాత చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన వృద్ధాప్య సమస్యల కారణంగా బుధవారం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆరు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో స్కెరిట్ ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. 1979లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ హారర్ క్లాసిక్ ‘ఏలియన్’లో స్పేస్‌షిప్ కెప్టెన్ డల్లాస్‌గా, 1986 నాటి ‘టాప్ గన్’లో టామ్ క్రూజ్‌కు శిక్షకుడైన కమాండర్ "వైపర్"గా ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 1992 నుంచి 1996 వరకు ప్రసారమైన ‘పికెట్ ఫెన్సెస్’ అనే టీవీ సిరీస్‌లో షెరీఫ్ పాత్రకు గాను 1993లో ఉత్తమ నటుడిగా ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు కన్నుమూత..
23 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)