Magazines

గిగ్‌ వర్కర్లకు రూ.5 లక్షల జీవిత బీమా.. పథకం ప్రారంభించిన రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డి

19 నిమిషాల క్రితం

https://navatelangana.com/breaking-news/rs-5-lakh-life-insurance-for-gig-workers-scheme-launched-by-rahul-gandhi-and-cm-revanth-reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – హైదరాబాద్‌: గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జయభేరి గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో గిగ్‌ వర్కర్ల విధివిధానాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గిగ్‌ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల జీవిత బీమా, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య భద్రత కల్పిస్తామని ప్రకటించారు. గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డులు అందజేస్తామని చెప్పారు. అంతకుముందు శిల్పకళా వేదిక నుంచి జయభేరి గ్రౌండ్స్‌ వరకు గిగ్‌ వర్కర్లు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డి, పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్