నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించనున్న స్పెషల్ టెట్-2026 పరీక్షకు విద్యాశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 10,586 మంది అభ్యర్థులు ఈ నెల 12వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 19న పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష కొనసాగుతుంది. అభ్యర్థులు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చు.
స్పెషల్ టెట్-2026 హాల్‌టికెట్లు 12 నుంచి డౌన్‌లోడ్
10 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)