నవతెలంగాణ-హైదరాబాద్: బాలీవుడ్ నడుటు టైగర్ ష్రాఫ్ దాడి కేసులో మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి కోసం ఆయుధాలను సమకూర్చుకోవడంలో సహాయపడ్డారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి అధికారులు 10మందిని అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత, ముంబై పోలీసులు సమీర్-జతిన్‌లను అరెస్టు చేశారు. మంగళవారం హర్యానా, ఢిల్లీలో ఇద్దరు మహిళలతో సహా నలుగురిని అరెస్టు చేశారు. తొమ్మిదవ నిందితుడైన జతిన్, ఆయుధాలు సేకరించడానికి ఇతర నిందితులు కునాల్, సుమిత్‌లతో కలిసి అమృత్‌సర్‌కు వెళ్లాడు.






కామెంట్‌లు (0)