నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో పండగ వేళ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, బాచుపల్లి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. గోపన్‌పల్లిలోని జయభేరి అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న బట్టుల మారెడ్డి (65), ఆయన భార్య భారతి (60), కుమారుడు నిశాంత్ రెడ్డి (38) తమ ఫ్లాట్‌లో మృతి చెందారు. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో బాచుపల్లి ఫ్లైఓవర్‌పై బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో సూర్య అనే ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న యువతికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో పండగ వేళ విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)