Magazines

అండర్‌-19 ఆసియా కప్‌.. పాక్‌ లక్ష్యం 209 రన్స్

5 గంటల క్రితం

arjun-rajput-india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అండర్‌-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 208 పరుగులకు ఆలౌటైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియాకు పాక్‌ బౌలర్లు గట్టి పోటీనిచ్చారు. అయితే భారత బ్యాటర్‌ అర్జున్‌ రాజ్‌పుత్‌ (107; 85 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. వికెట్లు వరుసగా పడుతున్నా నిలకడగా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (22), కావ్యా పటేల్‌ (23) మాత్రమే కొంతమేర రాణించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో భారత్‌ 46.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. పాక్‌ బౌలర్లలో అలీ రజా, రిజ్వానుల్లా, నికాబ్‌ షాఫిక్‌ తలో మూడు వికెట్లు పడగొట్టారు. సయ్యమ్‌కు ఒక వికెట్‌ దక్కింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్