Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రొమ్ము క్యాన్సర్ పై అవగాహన సదస్సు 

రొమ్ము క్యాన్సర్ పై అవగాహన సదస్సు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక వెనుకబడిన బాలికల కళాశాల వసతి గృహంలో రొమ్ముక్యాన్సర్ వ్యాధి పై అవగాహన సదస్సు గురువారం నిర్వహిించారు. ఈ కార్యక్రమాానికి ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ పానస అరవింద్ హాాాజరైజ మాట్లాడుతూ.. ఇది సహజంగా వంశపారంపర్యంగా గాని, జన్యుపరంగా గాని, హార్మోన్స్ లోపం వల్ల గాని, రొమ్ము భాగంలో కణాలు నియంత్రణ లేకుండా విపరీతంగా పెరగడం వల్ల గానివస్తుంది.

రొమ్ముక్యాన్సర్ ను గుర్తించే విధానం ఎలాగంటే రొమ్ములో నొప్పి రావడం, రొమ్ము సైజులో మార్పు రావడం, రొమ్ములో కణాలు విపరీతంగా పెరగడం మరియు రొమ్ము నుండి రక్తం కారడం లాంటిది జరిగితే వెంటనే వైద్యుని సంప్రదించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పాకాల నరసింహారావు, క్లబ్ సెక్రెటరీ గంజి రమేష్, ప్రాజెక్టు చైర్మన్ చంద్రశేఖర్, హాస్టల్ అవార్డెన్ శ్రీమతి అంజుమ్ , హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -