Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారులకు తల్లిపాలే శ్రేష్టం: సీడీపీఓ కళావతి

చిన్నారులకు తల్లిపాలే శ్రేష్టం: సీడీపీఓ కళావతి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
పుట్టిన బిడ్డకు తల్లులు ఆరు మాసాల పాటు తల్లిపాలే ఇవ్వాలని పిల్లలకు తల్లిపాలు శ్రేష్టమైనవి అని మద్నూర్ ఐసిడిఎస్ సిడిపిఓ కళావతి అన్నారు. సోమవారం అంగన్వాడి సెంటర్లో తల్లులకు అవగాహన కల్పించారు. డోంగ్లి మండలంలోని హసన్ టాక్లి అంగన్వాడి సెంటర్ ను సందర్శించి, తనిఖీ చేశారు. అదేవిధంగా పిల్లల బరువును పరీక్షించారు. పిల్లలకు బాలమృతం, పౌష్టికాహారం ప్రాధాన్యత గురించి వివరించారు. అంగన్వాడీ టీచర్ సచిత పని తీరుపై సిడిపిఓ అభినందించారు. సెంటర్లు అన్ని రకాలుగా నిబంధనాల ప్రకారం పనులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ గ్రామ అంగన్వాడి భవన నిర్మాణానికి నిధులు మంజూరైనట్టు తెలిపారున. గ్రామ సర్పంచ్ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో గ్రామ ఉపసర్పంచ్ తో సిడిపిఓ చర్చించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సచిత, అంగన్వాడి ఆయా, అంగన్వాడి చిన్నారులు, తల్లులు గర్భవతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -