నవతెలంగాణ – భువనగిరి
జగదేపూర్ రోడ్డు జగపూర్ రైల్వే బ్రిడ్జిపై గుంతల పడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే మరమ్మతులు చేపట్టాలని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జగదేపూర్ రోడ్డు రైల్వే బ్రిడ్జిని మరమ్మతులు చేయాలని కోరుతూ బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ రోడ్డులో గత నెల రోజుల నుంచి ప్రమాదాలు జరిగి ముగ్గురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోడ్డు పై మరమత్తులు చేసే ఆలోచన లేకపోవడంతో విడ్డూరంగా ఉందన్నారు.
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు మేలుకొని వెంటనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహిస్తున్న వారిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. 4 రోజుల్లోపు రోడ్డు పనులు మొదలు పెట్టాలని.. లేకపోతే భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు ఏవి కిరణ్, పట్టణ కార్యదర్శి రచ్చశ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ ఖాజ అజీముద్దీన్, కుశంగుల రాజ, ఇట్టబోయిన గోపాల్, మండల అధ్యక్షులు జనగాం పాండు, మైనార్టీ నాయకులు , ముహమ్మద్ ముజీబుద్దీన్, అమిర్, అమీనుద్దిన్ పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు.
జగదేపూర్ రైల్వే బ్రిడ్జి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని బీఆర్ఎస్ ధర్నా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES