నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపు మేరకు చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే.. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన బీసీల ధర్నా కార్యక్రమానికి జుక్కల్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం వెళ్లారు.
బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, తప్పుడు సమాచారాన్ని సంకేతాలు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం నికి నిరసనగా నేడు మహాధర్న కార్యక్రమం విజయవంతం చేసింది. మండలం నుండి బిసి మరియు మండల, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు ధర్నా సభను విజయవంతం చేయడానికి భారీగా వాహనాలలో తరలి వెళ్లడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి వెళ్లిన వారిలో జుక్కల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీలు పటేల్, వాస్రే రమేష్ , బొద్ది గంగాధర్ , పెద్ద ఏడ్గి రఘు , ఖండేబల్లూర్ శివరాజ్ దేశాయ్ , భాను గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- చలో హైదరాబాద్ బీసీ ధర్నా కార్యక్రమానికి బయలుదేరిన జుక్కల్ బి ఆర్ ఎస్ నాయకులు.