నవతెలంగాణ – పెద్దవూర
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కో గ్రామం నుంచీబీఆర్ఎస్ నాయకులు ఒకే అభ్యర్థిని సూచించాలనినాగార్జున సాగర్ మాజీ శాసన సభ్యులు, నియోజకవర్గం ఇంచార్జి నోముల భగత్ కుమార్,మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలువు నిచ్చారు. ఆదివారం మాడుగుల పల్లి మండలం, ఇందుగుల గ్రామంలో ఫంక్షన్ హాల్ లో స్థానిక సంస్థల ఎన్నికల పై ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల సమావేశం లో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజుగా చేయాలని తపనతో రైతులను గుండెల్లో పెట్టుకొని చూసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాపాడుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని, రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని, రైతుబంధు, రైతు బీమా విషయంలోనూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసంచేసిందని విమర్శలు చేశారు.
ఒక్కో అభ్యర్థి కోసం కష్టపడి గెలిపించుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోఈ “కాంగ్రెస్ బాకీ కార్డే” మన బ్రహ్మాస్త్రం అని, కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు పగిల్ల సైదులు, యాదగిరి రెడ్డి, ఖాసిం, కృష్ణయ్య, జనార్ధన్, రాములు, సన్నాల నాగరాజు, తవిటి సైదులు, గొడుగు రమేష్, కన్నెబోయిన నాగరాజు, దర్శనం నాగయ్య, పూసలపాడు జలంధర్, మేకల నరేష్, బంగారపు రవి, డాకయ్య, కొండేటి కెప్టెన్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఒక్కో గ్రామం నుంచీ బీఆర్ఎస్ నాయకులు ఒకే అభ్యర్థి ని సూచించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES