- Advertisement -
 నవతెలంగాణ – చిన్నకోడూరు 
మండలపరిదిలోని మాచాపూర్ గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తేళ్ల కుమారస్వామి (45) అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం విషయం తెలుసుకొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు  వేలేటి రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ కూర మాణిక్య రెడ్డిలతో కలిసి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం గ్రామానికి చెందిన  ఎఫ్ పి ఓ చైర్మన్ ఎలేటి వెంకట్ రెడ్డి, అల్లిపూర్ సొసైటీ చైర్మన్ బొడిగ సదానందం గౌడ్ తో పాటు గ్రామస్తులు సుంచు ఎల్లయ్య, వెంకటరెడ్డి, రాజారెడ్డి, తదితరులు  దహన సంస్కారాల్లో పాల్గొని నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

                                    

