Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం..

బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం..

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం పార్టీ మండల అధ్యక్షులు లాకావత్ నరసింహ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాయకులతో మాట్లాడుతూ.. మండలంలోని జడ్పిటిసి తో సహా ఎంపిటిసి లన్ని  గెలిచే సత్తా ఉన్న ఏకైక పార్టీ బి ఆర్ ఎస్ పార్టీ మాత్రమే అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడుతూ తప్పుడు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ 22 నెలల కాలంలోనే ప్రజల విశ్వసాన్ని కోల్పోయింది అని ఇంత తక్కవకాలంలో ఈ పరిస్థితి తెచ్చుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానిక ఎన్నికలలో ప్రజలు ఓటువేయారు అని అన్నారు.

మోసపోయిన ప్రజలు కాంగ్రెస్ నిచ బుద్దిన తెలుసుకున్నారని ఇక ఈ ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ విజయం కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైనట్టే అని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు పిన్నింటి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు రాంచెందర్ నాయక్, వెలిశాల స్వరూప, ఆలూరి శ్రీనివాసరావు, లకావత్ చందూలాల్, మండల కమిటీ బాద్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అన్ని గ్రామాల అధ్యక్షులు, ,సర్పంచ్,వార్డ్ మెంబర్ల ఆశావహులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -