Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎల్పీజీ కొరతకు నిరసనగా గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఆందోళన

ఎల్పీజీ కొరతకు నిరసనగా గన్‌పార్క్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఆందోళన

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎల్పీజీ కొరతకు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం గన్‌పార్కు వద్ద ఆందోళన చేపట్టారు. గ్యాస్‌ సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ యుద్ధం ప్రారంభమయ్యాక ఎల్పీజీ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొరత లేదంటూ నమ్మబలుకుతోందని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో మాత్రం గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉందన్నారు. భవిష్యత్తులో గ్యాస్‌ సిలిండర్‌ సైజ్‌ తగ్గిస్తారన్న అనుమానాలున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.
బీఆర్‌ఎస్‌వీ నేతల అరెస్టు దుర్మార్గం : కేటీఆర్‌
పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రెండు లక్షల ఉద్యోగ నియామకాల హామీ ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్‌ఎస్‌వి నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో వాటిని నిధులు విడుదల చేయాల్సిందిపోయి, ప్రశ్నించిన గొంతుకలపై నొక్కేయడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం విద్యార్థి నాయకులు అసెంబ్లీని ముట్టడించాల్సిన దుస్థితి తెచ్చినందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిగ్గుపడాలని సూచించారు.
తమకు న్యాయం చేయండి : కేటీఆర్‌కు వికలాంగుల వినతి
తమను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందనీ, తమకు న్యాయం చేయాలని వికలాంగులు మంగళవారం అసెంబ్లీ బయట కేటీఆర్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రం సమర్పించారు. బుధవారం ఇందిరాపార్కు వద్ద చేపట్టిన నిరసన దీక్షకు రావాలని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. వారికి రూ.6వేలు పెన్షన్‌ ఇస్తామని మాట తప్పిందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -