Tuesday, March 24, 2026
E-PAPER
Homeఖమ్మంఅగ్ని ప్రమాద బాధితులకు అండగా బీఆర్ఎస్

అగ్ని ప్రమాద బాధితులకు అండగా బీఆర్ఎస్

- Advertisement -

– నిరాశ్రయులకు నిత్యావసర సరుకుల అందించిన నాయకులు 
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ప్రజలు ఆపదలో ఉన్నారంటే చాలు మేము ఆసరాగా ఉంటాం అంటూ ముందు వరుసలో నిలుస్తున్నారు బీ ఆర్ఎస్ నాయకులు. మండలంలోని కొత్త నారవారిగూడెంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కిన్నెర శ్రీను,కిన్నెర అర్జున అనే అన్నా దమ్ములు కుటుంబాలను బీఆర్ఎస్ అండగా నిలిచింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇళ్లు పూర్తిగా దగ్ధమై, తినడానికి తిండి, ఉండటానికి నీడ లేక అల్లాడుతున్న బాధితులను చూడగానే నాయకులు చలించిపోయారు.కేవలం పరామర్శకే పరిమితం కాకుండా,ఆ కుటుంబాలు తక్షణమే కోలుకోవాలనే ఉద్దేశంతో వారికి అవసరమైన బియ్యం,నిత్యావసర సరుకులు వంట సామాగ్రిని మంగళవారం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు ఎల్లప్పుడూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములవుతారని,బాధితులకు ప్రభుత్వం నుండి కూడా తగిన సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. క్లిష్ట సమయంలో తమను ఆదుకోవడానికి తక్షణమే స్పందించిన  నాయకులపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మనుగొండ నాగమణి,జెడ్పీటీసీ మాజీ సభ్యులు జేకేవీ రమణారావు,మండల పరిషత్ మాజీ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి,నారంవారిగూడె, వేదాంత పురం మాజీ సర్పంచ్ లు మనుగొండ వెంకటముత్యం,సోని శివ శంకర ప్రసాద్, డాక్టర్ భూక్యా ప్రసాద్, కాసాని చంద్రమోహన్,మోటూరి మోహన్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -