వరద బాధ్యతూలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది పునరావసం కేంద్రం సందర్శనలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే
నవతెలంగాణ – మద్నూర్
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు వరదనీటితో ముంపుకు గురవుతున్నారు. ఈ ముంపు నుండి కాపాడేందుకు ప్రభుత్వం మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. వరద బాదితులకు సౌకర్యాలు కల్పించే కేంద్రాన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు సండే శుక్రవారం సందర్శించించారు. అనంతరం బాదితులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాదితులకు బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. జరిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించే విధంగా పార్టీ తరఫున పోరాడుతామని తెలిపారు. పునరావాస కేంద్రంలో వరద బాధితులకు సౌకర్యాల ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మండల తాహశీల్దార్ ఎండి ముజీబ్ తో మాట్లాడుతూ తెలిపారు. ఆయన వెంట టఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వరద బాదితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES