ప్రశ్నించే హక్కును హరిస్తున్న కాంగ్రెస్…
తాడ్వాయి మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – తాడ్వాయి
కాంగ్రెస్ నాయకుల అరాచకాలు అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తున్న గొంతులు అంచవేతలపై పత్రికా విలేకరులపై జరుగుతున్న దాడులు వ్యతిరేకిస్తూ ఈనెల 7న ప్రజా నిరసన కార్యక్రమం చేపడతామని తాడ్వాయి మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల వేధింపులకు నియోజకవర్గంలో ఇప్పటికే ముగ్గురు బలిదానం అయ్యారని, తిక్క దండాలు, అవినీతి అక్రమాలు, భూకబ్జాలు ప్రశ్నించిన వారిపై దాడులు ములుగు నియోజకవర్గంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని, అదేవిధంగా వార్తలు రాసిన పత్రిక విలేకరుల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మంత్రి సీతక్క ములుగు జిల్లా ఎస్పీ చేత సిటీ పోలీస్ యాక్టివ్ అమలు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి సీతక్క పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజాస్వామ్యం బద్ధంగా ములుగు జిల్లా ప్రజల స్వేచ్ఛ కోసం బిఆర్ఎస్ పార్టీ శాంతియుతంగా ప్రజా నిరసన కార్యక్రమం చేపడతామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అందరూ బిఆర్ఎస్ పార్టీ, అనుబంధం సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మేధావులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.