- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు హైదరాబాద్ లో బిఆర్ఎస్వి శిక్షణ తరగతులలో భాగంగా నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను శుక్రవారం కలిసి యూనివర్సిటీలో నేలలోని ఉన్న సమస్యలు విన్నవించినట్లు తెలంగాణ యూనివర్సిటీ బిఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు శ్రీను రాథోడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు అందుబాటులో ఆడిటోరియం, అదేవిధంగా బాలికల వసతి గృహం ఏర్పాటు, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు తదితర వాటిపై వివరించినట్లు తెలిపారు. కలిసినవారిలో ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ బిఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు దేవేందర్, అనిల్, వెంకటేష్ ముదిరాజ్, నరేష్ పటేల్, భాస్కర్ యాదవ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -