- Advertisement -
నవతెలంగాణ – గండీడ్/ మహమ్మదాబాద్
విద్యుదాఘాతంతో ఓ పాడి గేదె మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లాఉమ్మడి గండీడ్ మండల పరిధిలోని జూలపల్లి గ్రామానికి చెందిన రైతు గొల్ల దశరథ్ కుచెందిన పాడి గేదె శుక్రవారం గ్రామ శివారులో మేత మేస్తూ.. గురువారం సాయంత్రం గాలి వర్షానికి తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు తాకి అక్కడిక్కడే మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని బాధితరైతు వాపోయాడు. ప్రభుత్వం తనను ఆర్థికంగా ఆదుకోవాలని కోరాడు.
- Advertisement -