నవతెలంగాణ – ఆలేరు టౌన్
తరగతి గదినుండే నవభారత నిర్మాణం ప్రారంభమవుతుందని, శ్రీ రామకృష్ణ విద్యాలయ ప్రధానాచార్య బండిరాజుల శంకర్ అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం పాఠశాలలో ‘స్వపరిపాలన దినోత్సవం’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. దేశం అభివృద్ధి చెందాలంటే పాఠశాలల పాత్ర కీలకమని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. తల్లిదండ్రుల తరువాత ఆ పిల్లల క్షేమాన్ని, ఉజ్వల భవిష్యత్తును కోరుకునేది విద్యాబుద్ధులను నేర్పే గురువు మాత్రమే. అందుకే గురువుకు అంతటి ఉత్కృష్టమైన స్థానాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ ఉత్సవంలో వివిధ పదవులు చేపట్టిన విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిగా తరిగొప్పుల సాయి చంద్, ఎం.పి గా అమిత్ శ్రీ వాత్సవ్, ఎం.ఎల్.ఏగా గోరంట్ల అక్షయ్, డిఇఓగా పంజాల వైష్ణవి , డిప్యూటి డిఇఓ గా సూదగాని కీర్తన, ఎంఇఓ పేరబోయిన ప్రణయ్, ప్రిన్సిపాల్ గా లోచారపు సంజన, వైస్ ప్రిన్సిపాల్ గా తోట శివ, కలెక్టర్ గా కాంసాని జశ్వంత్, డాక్టరుగా బడే ప్రణతి, ఉపాధ్యాయులుగా ముస్కె బాలశ్రీదేవి, నాలోజు శ్రీలక్ష్మీ, చింతకింది సాయి లహరి, రాసమల్ల రోష్మిక, పత్తి వైశాలి, బుడిగె పూజ, మధు , మనోజ్, వేణుగోపాల్, సాయిరాఘవేంద్ర, అజయ్ , సామ్యూల్ తదితరులు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ తరిగొప్పుల రమేశ్, ఆచార్యులు జూకంటి సిద్ధులు, నారగోని భీమేశ్, బొడ్డు రమేశ్, గుగ్గిళ్ళ జయమ్మ, మాడిశెట్టి వాణిశ్రీ, కడారి పరమేశ్వరి, కాయితి అన్నపూర్ణ, అంబాల ప్రసన్నలక్ష్మి, అప్పాల స్వరూప, మైలబోయిన పావని, ఆత్మకూరి దీపిక, యెనగందుల కవిత, వంగపల్లి శ్వేత, పిడిశెట్టి భవాని, వేముల భవాని, ఎం.మౌనిక, కొండ స్వాతి, సిరికొండ పద్మలత, యెలగందుల మమత పాల్గొన్నారు.



