అధ్యక్షులుగా పాషా ఎన్నిక
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎస్కే పాషా బాయ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉబ్బపల్లి బుజ్జి బాబు, ప్రధాన కార్యదర్శి అంగరాజు రాంబాబు, కోశాధికారిగా గోవర్ధన్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ , జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలన్నారు. కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు బావాండ్ల పాండు, బి ఎం నాయుడు, బిల్డింగ్ పెయింటింగ్ ఆదర్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి మంద రాజు, నాయకులు యాదగిరి, ప్రసాదు, కిరణ్, బాబా, ఏసు తదితరులు పాల్గొన్నారు.
బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



