నవతెలంగాణ – కంఠేశ్వర్
భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వం ఇస్తూన్న లేబర్ గుర్తింపు కార్డులు తప్పని సరి పోంది ప్రభుత సంక్షేమ ఫలాలను పొందాలని ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి హరి కుమార్ అన్నారు. బుధవారం జిల్లా న్యాయసేవ సంస్థ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిధిగా ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి హరికుమార్, అతిధులుగా బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్రెడ్డి, లెబర్ అధికారి యోహన్, బార్ అసోసియోషన్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, లీగల్ఎయిడ్ డిఫెన్స్ చీఫ్ రాజ్కుమార్ సుబేదార్లు హజరైనారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇస్తూన్న ప్రతి సంక్షేమ ఫలాలు భవన నిర్మాణ కార్మికులకు అందలంటే తప్పని సరిగా ప్రభుత్వ గుర్తింపు లెబర్ కార్డు కల్గి వుండి వారి కుటుంబంకు బద్రతను కల్పించుకోవాలని తెలిపారు. కార్మికశాఖ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం వారికి ఎలా కార్డులు మంజూరు చేస్తూన్న విషయం తెలిపారు. బార్ కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ కార్మికులకు 60 సంవత్సరాలు దాటిన తరువాత పెంఛన్ ఇవ్వలని కార్మిక శాఖకు తెలిపారు. బార్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమంకు నూతనంగా నిర్మించే ప్రతి భవనం నుండి ఓక శాతం సెజ్ ద్వార కార్మిక శాఖకు డబ్బులు జమా అవుతాయని అందువలన ప్రతి కార్మకుడి కార్డుని పొందాలని దీనిని ప్రతి ఐదు సంవత్సరాలకు ఓక్కసారి రినివల్ చేయించు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజేందర్ రెడ్డి, రాజ్కుమార్, సుబేదార్, మాణిక్ రాజ్ , కార్మిక శాఖ కార్యాలయం అధికారి యోహాన్,భవన నిర్మాణ కార్మికులు, పారలీగల్ వాలంటరీలు, కమ్యూనిటి మిడియేటర్లు పాల్గోన్నారు.
భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వ గుర్తింపు కార్డులు తప్పని సరి తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES