Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఒకేరోజు మూడు ఇళ్లల్లో చోరీలు

ఒకేరోజు మూడు ఇళ్లల్లో చోరీలు

- Advertisement -

•మర్రిగూడ ఎస్ఐ బి. రాంబాబు 
నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని శివన్నగూడ,ఖుదాబక్ష్‌పల్లి గ్రామాల్లో తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చోరీలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని,అయితే ఆ మూడు చోరీలు ఒకే రోజు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ బి.రాంబాబు తెలిపారు.బాధితులు ఎక్కువ రోజుల పాటు దూర ప్రాంతాల్లో ఉండటంతో వారి ఇల్లు చోరీ అయ్యిందని ఆలస్యంగా గుర్తించి వేర్వేరు తేదీల్లో ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు.పలు సామాజిక మాద్యమాలలో వస్తున్న ప్రచారం వల్ల  వరుస చోరీలు జరుగుతున్నాయనే అపోహలు ప్రజల్లో ఏర్పడుతున్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్‌ ఐ స్పష్టం చేశారు.

నిందితులను పట్టుకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టామని వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తే పోలీసులకు,ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వాలని,ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజల భద్రతకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -