- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందారు. నవ్య, మానస ఇద్దరూ మరణంలోనూ కలిసే ఉన్నారంటూ నవ్య తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నప్పటి నుంచి వారిద్దరూ కలిసే పెరిగారని, ఒకేచోట చదువుకున్నారని తెలిపారు. ఈ మేరకు ఒకేచోట పనిచేస్తున్న ఈ స్నేహితులు సెలవులకు ఇంటికి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
- Advertisement -



