- Advertisement -
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సౌదీ అరేబియాలో బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో హైదరాబాద్ కు చెందిన 45 మంది సజీవ దహనం కావడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పేర్కొంది. మరణించిన వారికి సంతాపాన్ని ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. సోమవారం ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకో వాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -



