– మున్సిపాల్టీ కి రూ.15 కోట్లు
– మైనార్టీలకు 83 కుట్టు మిషన్ లు పంపిణీ
– ఆదర్శ నియోజక వర్గంగా అశ్వారావుపే
– విలేకర్లు సమావేశంలో ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చుదిద్దుతానని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం స్థానిక తన అధికారిక నివాస గృహంలో విలేకర్లు సమావేశంలో వివరించారు. ముందుగా ఆయన మున్సిపాలిటీ పరిధిలో గతంలో 2018 – 2019 నిర్మించిన 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేసి ఇండ్లు కేటాయించారు. అనంతరం ముస్లిం మైనార్టీ మహిళా లబ్దిదారులకు మొదటి దఫా గా 83 మందికి కుట్టు మిషన్ లు పంపిణీ చేసారు.
తర్వాత విలేకరుల తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అశ్వారావుపేట కొత్త మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.15 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఈ నిధులతో నూతన మున్సిపాలిటీ భవనం ఆధునిక మున్సిపల్ మార్కెట్ పబ్లిక్ టాయిలెట్లు ట్యాంక్ బండ్ అభివృద్ధి దొంతికుంట చెరువు నందు సీసీ రోడ్లు డ్రైనేజీ ల నిర్మాణ పనులు చేపట్ట నున్నామని తెలిపారు. అశ్వారావుపేట,దమ్మపేట మందలపల్లి చండ్రుగొండ బస్ స్టాండ్ ల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను తెలియజేసారు.
అశ్వారావుపేట బస్ స్టాండ్ ను డిపో గా అభివృద్ది చేస్తామని తెలిపారు.నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త బీటీ రోడ్లు,రైతుల కోసం పంట పొలాలకు వెళ్లేందుకు గ్రావెల్ రోడ్లు సైడ్ డ్రైనేజీ ల నిర్మాణం కోసం కూడా నిధులు సమీకరించామని త్వరలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ – బీఎఫ్ఏసీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు,ఏఎంసీ చైర్మన్ వాసం రాణి,అశ్వారావుపేట పీఏసీఎస్ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ,ఎంపీడీఓ అప్పారావు,మున్సిపల్ కమీషనర్ నాగరాజు, ఐటీడీఏ ఏఈ బీవీఎస్ ప్రసాదరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు, నాయకులు జూపల్లి ప్రమోద్, ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.