నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేక కృషి ఫలితంగా డోంగ్లి మండలంలోని మారుమూల గ్రామాలైన సిర్పూర్, పెద్ద టాక్లి, చిన్న టాక్లి, గ్రామాకు బస్సు సౌకర్యం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆ గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీ సహకారంతోనే ఎన్నో ఏండ్ల మా కళ సాకారమైందని అన్నారు. గ్రామాల్లో ఉండే ఆడపడుచులు ఇన్నాళ్లకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోనున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం పెద్ద టాక్లి సర్పంచ్ కుమారుడు గైక్వాడ్ విలాస్ బస్సుకు ప్రత్యేక పూజలు చేశారు. అధేవిధంగా బోధన్ డిపో ఆర్టీసీ అధికారులకు, కండక్టర్, డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత కండక్టర్, డ్రైవర్, ఆర్టీసీ అధికారులు శ్రీనివాస్, విట్టల్ రావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



