Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించాలి..

ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించాలి..

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

జిల్లాలో ఉన్న 6 ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు అన్నారు. సోమవారం రోజున  జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లాలో ఉన్న ఆరు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి పాఠశాలలు మండల కేంద్రం పేరుతో ఉన్న మండల కేంద్రానికి నాలుగు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని , విద్యార్థులు మండల కేంద్రం నుండి పాఠశాలకు 4, 5 కిలోమీటర్లు కాలినడకన ఆటోలలో ప్రైవేటు వాహనాలు వెళ్తున్నారు పాఠశాలకు సమయానికి వెళ్ళలేక విద్యార్థులు చాలా ఇబ్బందిగా గురవుతున్నారు.

గ్రామాల నుండి వచ్చే బస్సులు సమయానికి రాక పాఠశాలకు సమయానికి వెళ్లలేని దృష్టి ఎదుర్కొంటున్నారు గతంలోనే బొమ్మలరామారం  మండలంలో ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు బస్సు లేక ప్రైవేటు వానలో ప్రయాణం చేస్తున్న ఇద్దరు విద్యార్థులను హాజీపూర్ ఘటనలో అత్యాచారం చేయడం జరిగింది. కావున ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు మండల కేంద్రంనికి దూరంలో ఉన్న అడవిలలో పాఠశాలలో ఉన్నాయి కావున విద్యార్థులకు కాలినడక వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు అత్యాచారాలు  ఘటనలు జరిగే ప్రమాదం ఉన్నాయని, విద్యార్థులకు ప్రైవేట్ వాహనాలు వెళ్ళలేక కాలినందుకు వెళ్తున్నారు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -