- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: క్రిస్మస్ పండుగల వేళ మెక్సికోలోని వెరాక్రూజ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీ నుంచి చికోంటెపెక్ గ్రామానికి వెళ్తున్న బస్సు జోంటెకోమట్లాన్ పట్టణం సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో 9 మంది పెద్దలు, ఒక చిన్నారి ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
- Advertisement -



