Sunday, November 16, 2025
E-PAPER
Homeసినిమాకానీ.. అలాంటి ప్రేమకథే

కానీ.. అలాంటి ప్రేమకథే

- Advertisement -

అఖిల్‌, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్‌ ఒరిజినల్స్‌ ప్రొడక్షన్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్‌ ఫిలింస్‌, మాన్‌ సూన్స్‌ టేల్స్‌ బ్యానర్స్‌ పై వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 21న ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీవాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం డైరెక్టర్‌ సాయిలు కంపాటి మీడియాతో ముచ్చటించారు. మాది వరంగల్‌ జిల్లా. చిన్నప్పటి నుంచే సినిమాల మీద ఆసక్తి ఉండేది. బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల ప్రయత్నాలు చేసినా, నా మనసంతా సినిమాల వైపే ఉండేది. కొన్ని స్క్రిప్ట్ర్‌ రెడీ చేసుకోవడం మొదలుపెట్టా. మొదట్లో కమర్షియల్‌ స్క్రిప్ట్స్‌ గురించి ఆలోచించినా, ఆ తర్వాత మనదైన నేటివిటీ, మన ఆత్మ ఆ మూవీలో కనిపించాలి అనిపించింది.

ఆ తరహా స్క్రిప్ట్స్‌ రాయడం ప్రారంభించా. డైరెక్టర్స్‌ వేణు ఊడుగుల, శ్రీకాంత్‌ అడ్డాల దగ్గర డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో వర్క్‌ చేశా. ఒకరోజు వేణు ఊడుగులకు ఈ కథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఒక డెమో షూట్‌ చేసుకుని రమ్మన్నారు. అది చేశాక. సినిమా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఈటీవీ విన్‌ వాళ్లు కూడా మా ప్రాజెక్ట్‌లో జాయిన్‌ అయ్యారు. ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు. కానీ అలాంటిదే. రాజు తన ప్రేయసి రాంబాయిని పెళ్లి చేసుకున్నట్లే ఊహించుకుని రాజు వెడ్స్‌ రాంబాయి అని రాస్తుంటాడు. ఈ కథలో ప్రేమికులకు ఏం జరిగింది అనేది మాత్రం తెరపైనే చూడాలి. నేను చిన్నప్పుడు ఈ ఘటన గురించి విన్నాను. అప్పట్లో మా దగ్గర సొసైటీలో ఎవరికైనా ఏదైనా గొడవ జరిగితే అన్నలు వచ్చి కొట్టి, బెదిరించి ఆ ఇష్యూని సెటిల్‌ చేసేవాళ్లు. ఈ కథలో బాధిత కుటుంబం వాళ్లను కలిసి ఇలా సినిమా చేస్తున్నానని అడిగితే, సినిమా చేయి గానీ మా పేర్లు, ఫొటోస్‌ బయటకు రాకుండా చూడమని కోరారు. 2004లో ఈ ఘటన జరిగింది. సురేష్‌ బొబ్బిలి సంగీతం సినిమాకు మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. ఆయన సంగీతం మా సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -