- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణం నవభారత డిగ్రీ, పీజీ కళాశాలలో టాటా స్ట్రైవ్ స్కిల్స్, నవభారత్ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ భువనగిరి పట్టణ, పరిసర ప్రాంతాల నుండి సుమారుగా 150 మంది అభ్యర్థులు ఈ డ్రైవ్ లో పాల్గొన్నారని తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్ లో హైదరాబాద్ కు చెందిన టాటా స్ట్రైవ్, బజాజ్ క్యాపిటల్, ఐ ఐ ఎఫ్ ఎల్, ఐ ప్రాసెస్, అపోలో ఫార్మసీ, అకాడమీ కంపెనీల హెచ్ ఆర్ లు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 48 మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -