Tuesday, March 31, 2026
E-PAPER
Homeకరీంనగర్ఎస్సారెస్పీ తూము లో లెవెల్‌తో గ్రామంలోకి కెనాల్ నీరు

ఎస్సారెస్పీ తూము లో లెవెల్‌తో గ్రామంలోకి కెనాల్ నీరు

- Advertisement -

నవతెలంగాణ-రాయికల్
మండలంలోని భూపతిపూర్ గ్రామంలో ఎస్సారెస్పీ తూము లో లెవెల్‌లో ఉండటంతో పాటు తూములో చెత్తాచెదారం ఇరుక్కుపోవడంతో కెనాల్ నీటి ప్రవాహం గ్రామంలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి స్పందన లభించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూము ఎత్తును పెంచి సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో స్థానిక రైతులు కాశిరెడ్డి వేణు, గంగారెడ్డి, రమేష్, మల్లయ్యతో పాటుగా నాయకులు మహేందర్ గౌడ్, వేణు, గ్రామపంచాయతీ సిబ్బంది తూములో ఇరుక్కున్న చెత్తాచెదారాన్ని తొలగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -