- Advertisement -
సమాచారం గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని స్కూల్ తండాలో గంజాయి మొక్కలను ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తాండాకు చెందిన రాజేందర్ ఇంటి పరిసరాల్లో 28 గంజాయి మొక్కలను సాగు చేస్తుండగా, పక్క సమాచారం మేరకు కామారెడ్డి రూరల్ సీఐ రమణ ఆధ్వర్యంలో దాడి చేసి మొక్కలను ధ్వంసం చేసి, రాజేందర్ పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం సంఘటన చోటు చేసుకోగా, సాయంత్రం 7:40 నిమిషాలైనా పోలీసులు వివరాలు వెల్లడించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- Advertisement -