నవతెలంగాణ – కంఠేశ్వర్ : సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై హత్య నేరం కేసు పెట్టి జైలుకు పంపాలి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై ముద్రించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పాషామైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 8 మంది కార్మికుల శవాలు కూడా దొరకకుండా కాళీ బూడిద అయ్యాయి.
ఈ ప్రమాదానికి కారణం అయినా సిగాచి యాజమాన్యం పై హత్యా నేరం కేసు పెట్టి జైలుకు పంపాలి, ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకోవాలి చనిపోయిన కార్మికులకు తగిన నష్టపరిహారం ఇవ్వాలి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి,క్షతగాత్రులకు ఒక్కొక్కరికి 50 లక్షలు చెల్లించి, ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వారికి మెరుగైన వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి ఒక్కరోజు ముందు సేఫ్టీ రక్షణలో ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన సిగాచి పరిశ్రమలో ఇంత హఠాత్తుగా ఇంత పెద్ద పేలుడు సంభవించడానికి కారణం ప్రభుత్వ విధానాల ఫలితమే తప్ప మరొకటి కాదు, ఈజీ ఆఫ్ డూయింగ్ పేరుతో, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో మొత్తం చట్టాలను మార్చివేసి పరిశ్రమ యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు అవకాశం కల్పించిన ఫలితమే ఈ ప్రమాదం జరిగింది. ఇంతకుముందు భద్రతా విషయంలో కార్మికులు ఫిర్యాదు చేసిన తనిఖీలు చేసి చర్యలు తీసుకునేవారు.
కానీ ఇప్పుడు సరళీకరణ విధానాల ద్వారా కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖ ఇన్స్పెక్టర్లు ఫిర్యాదులపై కూడా పరిశ్రమలను తనిఖీ చేయడానికి అనుమతించడం లేదు, ఇప్పటివరకు ఉన్న చట్టబద్ధమైన తనిఖీల్లో తీసుకొచ్చిన పాలనాపరమైన మార్పు, స్వీయ ధ్రువీకరణ విధానం వంటి వాటి ఫలితంగానే ఈ ప్రమాదం జరిగింది. ఇకనైనా పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చట్టాలను అమలు చేయాలని, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని, కార్మికుల, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, నరేష్, జాదవ్ మురళి ,థామస్, ప్రభాకర్, రవీందర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు పెట్టాలి: సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES