Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అనారోగ్యంతో పశువులు, మేకలు మృత్యువాత

అనారోగ్యంతో పశువులు, మేకలు మృత్యువాత

- Advertisement -

– నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పశు వైద్యుడు..
– విధులకు వెటర్నరీ డాక్టర్ డుమ్మాలు..
నవతెలంగాణ – జుక్కల్ 

మండలంలోని నాగల్ గావ్ గ్రామంలో అనారోగ్య కారణాలతో పాడి పశువులు,  మూగజీవాలు , మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన గను శ్రీనివాస్ అనే పాడి రైతు కోడె, షేక్ బాషా అని మరో రైతు మూడు మూగ జీవాలు మృత్యువాత పడ్డాయని తెలిపారు. వడ్ల వినోదని మరో పాడి రైతు ఆవులేగ దూడ ప్రస్తుతం అనారోగ్యంగా ఉందని, పరిస్థితి విషమంగా ఉందని పాడి రైతులు తెలిపారు.

పట్టించుకోవాల్సిన పశువైద్య సిబ్బంది వైద్యుడు గ్రామాల వైపు కన్నేత్తి చూడకుండా ఎక్కడ విధులు నిర్వహిస్తున్నాడో? తెలియని దుస్థితి నెలకొంది. వెటర్నరీ వైద్యుడు విధులకు డుమ్మాలు కొడుతూ ఆస్పత్రికి రాకుండా పాడి రైతులకు నష్టం చేకూర్చుతున్నారని ఆరోపణలు మండలంలో వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవలే సోపూర్ గ్రామంలో పలు పశువులు ఇటువంటి సమస్యలతోనే మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మరువక ముందే మండలంలోని నాగల్ గావ్ గ్రామంలో పశువుల మరణాల పర్వం మొదలైంది. జుక్కల్ వెటర్నరీ ఆస్పత్రిలో, కౌలాస్ వెటర్నరీ ఆస్పత్రి లో కాంపౌండర్లు తప్ప వైద్యుడు కనిపించడమే గగణమైంది. పశువులు రోగాల బారిన పడ్డప్పుడు అందుబాటులో లేని వైద్యులుఅవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

గతంలో మహిళా పశు వైద్యురాలిగా పనిచేసిన రమ్య దేవి స్థానికంగానే ఉంటూ నిత్యం విధులకు హాజరవుతూ పాడి రైతులకు అందుబాటులో ఉండేది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పశు వైద్యుడు అసలు ఉన్నాడా.. లేడా అని చాలా మంది రైతుల్లో రేక్తిత్తిన ప్రశ్న. ఇప్పటికైనా అధికారులు స్పందించి, మూగజీవాల ప్రాణాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. వెంటనే గ్రామాల్లో వెటర్నటీ మెడిక్ క్యాంపులను నిర్వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విధులకు దుమ్మా  కొట్టే వెటర్నరీ వైద్యునిపై శాఖపరమైన చర్యలు చేపట్టి, తొలగించాలని మండల పరిధిలోని రైతులు స్పష్టం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad